ముగ్ధాలక్షణం
| ముగ్ధా నవవధూః కామరతౌ వామా మృదుః క్రుధి. | 15 |
| యతతే రతిచేష్టాసు గాఢలజ్జా మనోహరా, | 16 |
| అప్రియ వా ప్రియం వాపి న కించిదపి భాషతే, | |
ఏయువిద మన్మథవిహారమందు నూతనస్త్రీ గాసు, మన్మథక్రీడయందు అస్వాధీనురాలుగాను, గాఢమైన లజ్జగలదిగాను, కోపకాలమందు స్తిమితగాను, నాయకుఁ డపరాధియయినను రోదనము చేయుచు చూచుచుండునదిగాను, రతివ్యాపారము యత్నముఁ జేయుచు హితాహితములను జెప్పకయుండునో యది ముగ్ధనాయిక.
మధ్యానాయికాలక్షణం
| సమానలజ్జామదనా ప్రోద్యత్తారుణ్యశాలినీ. | 17 |
| మధ్యా కామయతే శాంతం మోహాంతే సురతక్షమా, | 18 |
సమానములైన సిగ్గును కామమును గలదియును, వృద్ధిబొందు యౌవనము గలదియును, మోహవ్యాపారమధ్యమందు సురతయోగ్యత గలదియు నగుచు నాయకుని అపేక్షించునాయిక మధ్య యనఁబడును. ఆమధ్యనాయిక మానమనెడు కోకువ్యాపారముచే ధీర-అధీర-ధీరాధీర అని ముత్తెఱంగులు గలది.
మానలక్షణం
| ప్రియాపరాధావగమాత్సంజాతో మాన ఇష్యతే, | 19 |
నాయకాపరాధము దెలిసినపిదపఁ గలుగు మనోవ్యాపారవిశేషము