పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

లోని "నీచక్కదనంబుఁ చూప మనసైనది చూవుము” అనుమకుటమును శ్రీరమణీమనోహరశతకమునందుఁ బలుతావులఁ జేర్చికొనెను. దీనిబట్టిచూడ నీశతకము ఒకశతాబ్దమునకంటెఁ బూర్వము రచింపఁబడినది కాదని నిశ్చయింపవచ్చును. కవినివాసము సరియగు జీవితకాలము సహేతుకముగ నెవ్వరేని యెఱింగింతురేని ముందు ముద్రణమునందుఁ జేర్చి కృతజ్ఞుల మగుదుము. శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికి శ్రీపిఠాపురము సంస్థానాధీశ్వరు లొసంగిన వ్రాఁతప్రతి నాధారముఁ జేసికొని కవిభావానుకూలము లగు స్వల్పలోపములుమాత్రము సవరించి ముద్రణమునకుఁ బ్రత్యంతరము సిద్దపఱిచితిమి. కవి భాషాపరిజ్ఞానము లేనివాఁడగుటచే నుపయోగించినలోపములు సవరింపరానివగుటచే నటులే యుంచితిమి. భక్తిరసోద్బోధకమగు నీశతక మాంధ్రమహాజనుల యాదరణపాత్రము కాఁగలదని విశ్వసింతుము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు