పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

నియే చెప్పవచ్చును. శృంగారశతకసంపుటములో నది ముద్రణము కానున్నది. శ్రీరమణీమనోహరశతకము కవి కాలము తీరినపిమ్మట రచించెను. ఈశతకము రచించునాఁటికిఁ గవిభార్య గతించెను. గృహము ఋణములపాలయ్యెను. జ్ఞాతులు క్షేత్రముల హరించిరి. దరిద్రావస్థ తరింపఁజాలక సంపదల నిమ్మని మోక్ష మిమ్మని విష్ణుమూర్తిని బ్రార్థించుచు నెంతకుఁ దనివి చెందక తనసొదనంతయు మూఁడువందల పద్యములలోఁ జెప్పుకొనెను. కొన్ని పద్యములలో గేవల భగవద్గుణాభివర్ణనముమాత్రమె గావించెను. పద్యములందు భక్తిరసము స్ఫుటముగాఁ గలదుగాని భాషాదోషములు మిక్కుటముగాఁ గలవు. శబ్దలోపములు సంధిలోపములు యతిప్రాసలోపములు గూడఁ గలవు. కాలము తీఱిన ముదుసలితనమునందుఁ గూడ నీకవి కవితావిషయమున నేర్పు సంపాదింపఁజాలకపోయెను.

కవికాలము గ్రహించుటకుఁ దగునాధారము లీశతకమున లేవు. కవిస్తుతిలో దిమ్మకవిని జెప్పెను. పుసులూరి సోమరాజు రచించిన నందనందనశతకము