పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించినకవి గంగాధరుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. నియోగిబ్రాహణుఁడు. కవినిగూర్చిన చరిత్రాంశ మింతవఱకే శతకమందలి 282-వ పద్యము వలనఁ దెలియుచున్నది. శతకకవులచరిత్రములో నింకొకగంగాధరుఁడు కలఁడు. ఆతఁడు వీరశైవుఁడు గాన నీకవికి నాతని కెట్టిసంబంధము లేదు. కీరవాణిశతకము రచించిన గంగాధరకవి యొకఁడు కలఁడు. అతఁడు పట్టాభిరామామాత్యునకు రాజమ్మకుఁ గుమారుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. కవితాధోరణిలో నిరువురికిఁ బోలికలు గలవు. ఈ రెండుశతకములును పిఠాపురసంస్థానమునందే లభించినవి. రెంటియందును సమానముగా భాషాలోపములు కలవు గాన కీరవాణిశతకము, శ్రీ రమణీమనోహరశతకము రచించిన గంగాధరు లొకఁడె యని తలంపవచ్చును. కీరవాణిశతకము శృంగారసీసపద్యములు ౧౦౧ కలది. అందు వ్యాకరణలోపములున్నను భావలోపములు లేవ