పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

694

మా జీవితమునకు సంబంధించినవి యైనను బ్రపంచమునకు సంబంధించినవిగా స్ఫురించునటుల వ్రాసియున్నారము. అక్రమవర్తనలు కపటాచారులదుశ్చేష్టలు పరోపకారుల మనువారిదుండగములు సంస్కర్తలసాహసకార్యములు కొన్నియెడలఁ బేర్కొంటిమి. ఏపద్యము గాని ప్రత్యేకవ్యక్తుల దృక్పథమునం దుంచికొని వ్రాసియుండము. దాదాపుగా నీశతకము కామేశ్వరీశతకము కాళహస్తీశ్వరశతకము (గొంతవఱకు) వేణుగోపాలశతకము తెగలో జేరఁదగినది. భక్తికి నీతి కీశతకమునఁ గలయిక గలదు. శతకసంపుటములో నీశతకమును చేర్చి మమ్ము ప్రోత్సహించిన బ్రహశ్రీ వావిళ్ల. వేంకటేశ్వరశాస్త్రిగారియెడఁ గృతజ్ఞులము.

ఇట్లు,

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-1-28

శతావధానులు