పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

631

కారములతో వ్రాయఁబడినపద్యములుగూడఁ గలవు. ఆధునికశతకసంచయమునం దింతటి ప్రౌఢశతకములు లభించుట యరిది. శైలి సులలితముగా ద్రాక్షాపాకమునం దున్నది. భావములు మనోహరముగా నున్నవి. శతకమంతయుఁ జంపకోత్పలమాలికలతో నొప్పియున్నది. ఇతరశతకములవలెఁ గాక యీశతకము వాల్మీకిరామాయణకథానుసారముగా వ్రాయఁబడియుండుటచే బాలరామాయణమువలె సకృత్పఠనయోగ్యమునై యైహికాముష్మికప్రదమై యెప్పుచున్నది.

ఈశతకము తొలిముద్రణము అంటిన విరిగిపోవు సన్నని పెళుసు కాగితములపై మద్రాను ఆదివిద్యానిలయముద్రణాలయమున దుర్మతిసంవత్సరమున ముద్రింపబడెను. పూర్వముద్రణమునఁ గవి యభిప్రాయమునకు భిన్నము లగుదోషము లెన్నియో పడినవి. వ్యాకరణదోషములగు పరుషసరళద్రుతాద్యాదేశములు చాలవఱకు దుష్టములై వికారముగ నుంటచే యథామతి పూర్వగ్రంథానుసారముగా శుద్ధప్రతి వ్రాయించి సంస్కరించి యిప్పటికిఁ బరిశుద్ధముగా ముద్రింప నవకాశము గలిగినది. శ్రీరామభక్తులకు నాంధ్రసారస్వతరసవిదులగు రసికు