పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

630

కవులచరిత్రమునందు వివరింపఁబడలేదు. ఈ కవిజీవితకాలము నెఱుంగుట కాధారములు తెలియకున్నను బూర్వముద్రణప్రతి నాధారపఱచికొని నిరూపింతము. ఈకవి పితామహుఁడు 1620 ప్రాంతములలో నుండెను. మనుమఁడగు లక్ష్మణకవి ప్రాంతములలో సుప్రసిద్ధుఁడై యుండును. పూర్వముద్రితశతకము దుర్మతిసంవత్సర ఆశ్వయుజ 30 న ముద్రిత మైనట్లు ముఖపత్రమునందుఁ గలదు. ఇది మొన్నటిదుర్మతిగాక యంతకు వెనుకదిగాన పూర్వముద్రణము జరిగి యిప్పటికి అఱువదినాలుగుసంవత్సరములునిండినవి. కావున కవియు ముద్రణకాలమునాఁటివాఁడె యనియు నలువదిసంవత్సరములక్రింద కీర్తిశేషుడైయుండుననియుఁ దోఁచెడిని. కవినివాసాదికము ఇతర గ్రంథములనుగూర్చిన వివరము లేరేని పత్రికాముఖమునఁ బ్రచురించినఁ జరిత్రములలోఁ జేర్ప వీలు కలుగును.

ముకుందరాఘవశతకము నిర్దుష్టముగాఁ బ్రౌఢముగా మనోహరముగా నుండి పఠనయోగ్యముగా నలరారుచున్నది. ఇందు రామాయణకథయంతయు ముఖ్యాంశము లేమాత్రము విడువక రసవత్తరముగా నిముడ్పఁబడియున్నవి. ఆయాఘట్టములలో నంత్యనియమము వృత్త్యనుప్రాసాదిసముచితాలం