పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పీఠిక

ఈశతకమును జూలూరి లక్ష్మణకవి రచించెను. ఈయన మధ్వబ్రాహ్మణుఁడు. సుబ్బనార్యుఁడు శేషమ్మలకుమారుఁడు. ఆంధ్రభాషకు నన్నయభట్టారకునివలెఁ బ్రమాణుఁడగు అప్పయార్యుని మనుమఁడు. కవిని గూర్చిన చరిత్రాంశ మీశతకములోనిపద్యములవలన నింతవఱకు మాత్రమె తెలియును. పూర్వముద్రితప్రతిపై గ్రంథకర్త జూలూరి లక్ష్మీనరసు గ్రంథకర్త యని కలదు. వీనినాధారపఱచుకొని కవిజీవితమును గ్రహింపవలసియున్నది.

శతకకర్తయగు లక్ష్మణకవికి లక్ష్మీనరసు అనునామాంతరము గలదు. ఈకవి బ్రౌనుదొరవారియాదరణమున క్రీ.శ. 1800 ప్రాంతమున ననేకగ్రంథములకు వ్యాఖ్యలు వ్రాసియు నిఘంటురచనమునఁ గేలూఁత నొసంగియు మాతృభాషాసేవ గావించి సుప్రసిద్ధుఁడైన జూలూరిఅప్పయశాస్త్రిగారికి మనుమఁడు. అప్పయ్యశాస్త్రిగారు కొన్ని శతకములను రచించిరి. ముకుందరాఘవశతకకర్తయగు లక్ష్మణకవి శాస్త్రిగారికి మనుమఁడు. లక్ష్మణకవిజీవితము శతక