పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక



శతకవాఙ్మయములో వేదాంతశతకములు సుప్రసిద్ధములై యున్నవి. మతావేశపరులగు శైవకవులు మృదుమధురధారతో నద్వైతసిద్ధాంతరూపకములగు శతకములు పెక్కులు రచించియున్నారు. అట్టివానిలో సోమనాథుఁడు, అన్నమయ్యంగారు లోనగు కవులు జూపిన కవితానైపుణ్యము శతకవాఙ్మయమున కమృతబిక్ష పెట్టె ననుటలో సంశయము లేదు.

ప్రకృత సంపఁగిమన్నశతకము సులభమగుశైలిలో నద్వైతమతసంప్రదాయము లెఱిగించుచు దురాచారముల ఖండించుచుఁ బామరులకు సహితము మతరహస్యము లెఱిఁగించుట కనుకూలముగ నున్నది. ఇందు హఠయోగము సాధకున కుచితము గాదనియు యోగాభ్యాసము ముఖ్యమనియు ధూర్తగురువుల నాశ్రయింపఁదగదనియు వాదములు తగవులు ఆచారాదికములు వ్యర్థములనియుఁ గవి కంఠోక్తిగఁ జెప్పియున్నాఁడు. ఈశతకము వేదాంతవిషయముననెగాక కవితావిషయమునగూడ నాదర్శప్రాయమై యున్నది. ఈశతకము రచించినకవి పరమానందయతీంద్రుఁడు. ఇతనికి పరమానందతీర్థుఁడను నామాంతరము శతకాంతమునఁ గానవచ్చుచున్నది. ఇతఁడు సంపఁగిమన్నశతకమునేగాక పరమానందశతక