పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98. క. ధరలో విధియు నిషేధము
నెఱుఁగడు *తద్‌జ్ఞుండు మింటి కెగిరెడు తురగం
బెఱుఁగునె మిట్టయుఁ బల్లముఁ
బరమాత్మా శివముకుంద పరమానందా.

99. క. దూషణ యసూయకొఱకే
భాషాంతరరచన లెల్ల బ్రతుకులకొఱకే
వేషము వంచనకొఱకే
పాషండము శివముకుంద పరమానందా.

100. క. మెండుగ లోకులవలెఁ దా
నుండఁగవలెఁ గూడకున్న నొక్కెఁడ మౌనై
యుండఁగవలె నేర్పరియగు
పండితునకు శివముకుంద పరమానందా.

101. క. ఇద్ధర నయ్యష్టమహా
సిద్ధులు వలె ననుచు భ్రాంతిఁ జెందుదురేమో?
సిద్ధం బగుముక్తికిఁ బ్రతి
బద్ధంబులు శివముకుంద పరమానందా.

102. క. అణిమాదిసిద్ధపురుషులు
గుణవంతులుగాఁగ జనులు కొనియాడుదు రా
గుణహీనులఁ బొగడుదురే
ఫణిశాయీ శివముకుంద పరమానందా.

103. క. ఒకతుచ్ఛసిద్ధిఁ జూపిన
సకలజనుల్‌ వానిఁ జూచి సన్మానముగా
సకలంకజ్ఞా నందురు
ప్రకటముగా శివముకుంద పరమానందా.

104. క. అణిమాదిసిద్ధు లెల్లను
గణుతింపఁగ మోక్షవిధము గా దెట్లంటే
నణిమాదులు సగుణంబులు
ఫణిశాయీ శివముకుంద పరమానందా.

  • నజ్ఞుండు