పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55. క. అసమానరాజయోగా
భ్యసనంబునఁ బడమటింటఁ బదిలుం డైతే
దొసఁ గేమిలేనిముక్తికిఁ
బస వట్టిది శివముకుంద పరమానందా.

56. క. కలపండ్రెండు పదాఱును
నలువదిరెండైనచోట నయముగ నొకటై
తెలివొందు వెరవుఁ గూడిన
ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా.

57. క. ఇల బొమ్మరిండ్లలోపల
నలువున మఱి చిన్ని పాప లాడుచు నుండే
సులు వెఱిఁగి యచటఁ దనుఁగన
ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా.

58. క. మీఱిన దుర్వాసనలను
గూరిన మతి నణఁపనేర్చుఁ గుశలుఁడు ధరలో
నారూఢియోగవిద్యా
పారీణుఁడు శివముకుంద పరమానందా.

59. క. లో వెలి చూపులు రెండును
బో విడువఁ దదంతరమున బొలుపగుతత్త్వం
బావిధ మెఱుఁగును నిర్గుణ
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.

60. క. తలఁచినయది జడిమం బగు
తలఁ పుడిగిన శూన్యమగును దలఁచిన తలఁపే
సలలిత మగు చిద్బ్రహ్మము
బలిబంధన శివముకుంద పరమానందా.

61. క. కన్నుల ముందఱఁ దెలివై
కన్నది యదికాన్పటంచుఁ గన్న యతండే
పన్నుగ నిజవిద్యాసం
పన్నుఁడగున్‌ శివముకుంద పరమానందా.