పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

పంచతంత్రము హరిహరాంకితము గావించిన బైచరాజు వెంకటనాథకవి తన గ్రంథములో,

క. ఏ చనువు కలదు హరిహర
సాచివ్యము బొంద నితరజనులకు మది నా
లోచింపఁ దిక్కయజ్వకు
నాచనసోమునకు మఱియు నాకుం దక్కన్.

అనుపద్యము వ్రాయుచు హరిహరుల కంకిత మొసంగు స్వతంత్రత తిక్కనసోమయాజికి, నాచన సోమునకు, వెంకటనాథునకుఁ (తనకుఁ) గలదని తెలుపుటచే నీపరమానందయతి వెంకటనాథున కావలఁ బదునేఁడవశతాబ్దాంతమున నుండెనేమో యని తోఁచును. ఇది తురీయాశ్రమములోని నామమై యుండును. కవిజన్మనామము తెలియరాదు.

ఇట్లు
వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్