పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను బ్రత్యంతరసహాయమునుఁ బరిశీలింప నెన్నివిశేషాంశములు లభించునో తెలుపఁజాలము.

ఈకవినామము సదానంద వరదరాజయోగి యని శతకకవిచరిత్రకారులు వ్రాసిరి గాని యీశతకములో రెండుతావులలోఁగూడ సదానందయోగినామమే గలదు. నామాంతరము మృగ్యము. ఫణిభట్టకవి కద్వైతబోధనము సదానందయోగి గావించినటులఁ బరతత్త్వరసాయనమునఁ గలదు. ఫణిభట్టారకునికాలముగాని యతనిగురుఁడే శతకకర్త యనుట కాధారముగాని కానరాదు. ఈశతకలిఖితమాతృకలు నూఱుసంవత్సరములనాఁటివి కానవచ్చుచుంటవలనను వేమనశైలి ననుకరించుటవలనను బదునాఱు పదునేడు శతాబ్దములమధ్య నీకవి యుండెనని యూహసేయవచ్చును. ఈశతకమును బ్రత్యంతరసహాయమునఁ బరిశీలించుటయు నితరశతకములు కవికాలము పరిశోధించుటకు నావశ్యకము.