పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈసదానందయోగిశతకము సర్వవిధముల వేమనపద్యముల ననుకరించుచు దురాచారములను, కపటవృత్తులను, వృథాడంబరములను, కులీనులయవివేకమును ఖండించుచున్నది. ఇందలిపద్యములందుఁ బ్రాయికముగా వ్యాకరణదోషము లున్నను శైలి మాత్రము వేమనపద్యములకంటె జటిలముగ నుంటచే కవి యక్షరాస్యుఁడని తోఁచుచున్నది. కవికాలము నివాసాదికములు తెలుపు నాధారము లీశతకమునఁ గానరావు. స్థూలదృష్టిచే నీకవి వేమనయోగి కావలివాఁడని తలంపవచ్చును. ఇందలిపద్యములు రసవంతముగ నున్నవి.

ఇదివఱకు ప్రచురింపఁబడిన సదానందయోగిశతకమునందుఁ గవియభిప్రాయమునకు వ్యతిరిక్తములగు పాఠము లుండుటవలనఁ బ్రత్యంతరసహాయమునఁ బూర్వలోపములు సవరించి ముఖ్యములగు పాఠాంతరము లుదహరించి యీముద్రణమునఁ బుస్తకమును సవరించితిమి. తాళపత్త్రప్రతులతో బోల్చిచూడ క్రొత్తపద్యము లైదు లభించెను. ఇంక