పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షమున్‌ ద్వివిధసంప్రాప్తిన్‌ శతాంధ్రాఖ్య కా
వ్యము నర్పించితి మీపదాబ్జములకున్‌ వైకుంఠ నారాయణా! 104

శా. నీమూర్తుల్‌ గన నీకథల్‌ వినఁ దుదిన్‌ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్‌
నీమం బొప్ప భజింప నీజపము వర్ణింపన్‌ గృపం జేయవే
శ్రీ మించన్‌ బహుజన్మ జన్మములకున్‌ శ్రీయాదినారాయణా! 105

ఇది శ్రీపరమేశ్వరకరుణాకలితకవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య
పోతనామాత్యప్రణీతంబైన నారాయణశతకంబున
సర్వంబును సంపూర్ణము.