పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

భక్తిరసశతకసంపుటము


ఉ.

ఏవసుదేవనందనునియింగిత మౌదలఁ దాల్తు రెల్ల వా
రావసుదేవనందనునియాజ్ఞ రచించిన యుత్పలంబులన్
భావనఁ జేసిన న్వినిన వ్రాసిన వారి కభీష్టసంపద
ల్పావనముక్తి నిచ్చు దయ భవ్యుఁడు గృష్ణుఁడు సుస్థిరంబుగన్.

103

సంపూర్ణము.