పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

353

యనో యభిసారికగాఁ జేసి పిలువమనుటతోడనో ముగింపఁబడినశతకములు గలవు గాని తెలుఁగులోఁ గృష్ణుని దివ్యమహిమానువర్ణనప్రాధాన్యశతకములు లేవనులోపము నీశతకము తీర్చుచున్నది కావుననే యీశతకము భక్తజనములకుఁ బఠనీయముగ నున్నదని నుడివితిమి.

భాగవతాదిగ్రంథములలోని కథాంశములు శ్రీకృష్ణుని యమానుషకృత్యములు పద్యములం దభివర్ణించెనే గాని కవి తనకవితావిభమును భావసమృద్ధినిఁ జూపుటకు ప్రయత్నింపలేదు. మొదటిపద్యములలో జక్కనిసమాసభూయిష్టములగు నంత్యనియమములు గలవు. కవిత మృదుమధురముగా నున్నది. చాలవఱకుఁ బద్యములలోనియంశములు పురాణకథలె గావుర శతకమున ననుకరణము లంతగా లేవని చెప్పవచ్చును. శ్రీరామప్రాముఖ్యము గల దాశరథిశతకమువలె నిది కృష్ణప్రాముఖ్యమగు భక్తిరసశతకము. కవి యెంతమెలకువగఁ బూర్తిచేసినను భక్తిరసోద్దీపమున నీశతకము దాశరథిశతకమునకుఁ దీసిపోయినను దక్కుగల శ్రీకృష్ణభక్తిశతకములకుఁ దీసిపోదని మాతలంపు.

నందిగామ.

శేషాద్రిరమణకవులు,

1-6-26.

శతావధానులు.