పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించిన కవి వెల్లాల రంగయ్య. సుబ్బమ, ఆదినారులకుమారుఁడు. కవివిద్యాగురువు మన్నవ లక్ష్మణార్యుఁడు. కవి యేకులమువాఁడొ నివాస మెటనో యేకాలమున నుండెనో యెఱుంగనగు నాధారములు శతకమున లేదు. దాశరథిశతకములోనిపద్యముల కనుకరణపద్యము లుంటచేఁ గవి యాధునికుడని యూహింప నవకాశము కలుగుచున్నది.

ఈవసుదేవనందనశతకము 108 పద్యములతో నలరారుచున్నది. ప్రతిపద్యమునందున శ్రీకృష్ణుని యమానుషచర్యలు మనోహరముగా వర్ణింపఁబడినవి. కృష్ణునిశృంగారచేష్టల కీకవి తనశతకమున నెడమీయక కేవల మహిమానువర్ణనమె గావించుటచే నీళతకము కృష్ణభక్తులకు సర్వదా పఠనయోగ్యముగా నుండుననుట సత్యము. ఈకవినామము శతకకవుల చరిత్రమునందుఁ గూడఁ గానరాదు.

కవియందు వ్యాకరణదోషములు లేవనియె చెప్పవచ్చును. ధార నిరర్గళముగ మనోహరముగ నున్నది. అంత్యప్రాసపద్యములు సమాసజటిలపద్యములు చదువఁజదువఁ జవులూరుచుఁ జెవి కింపుగ నున్నవి. కృష్ణునిశృంగారలీలలు వర్ణించుచునో గోపికాలోలత్వమునకుఁ బ్రాముఖ్యమిచ్చి యే చెలి