పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

భక్తిరసశతకసంపుటము


జయ హరధనుఖండ జయ జానకీనాథ
                    జయ భృగుసుతభంగ జయ కృపాబ్ధి
జయ వనసంచార జయ వాలిమర్దన
                    జయ వార్ధిబంధన జయ మురారి


తే.

రావణాంతక సాకేతరమణ నీదు
వలస శతకము వినువారివలస లుడుగు
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధిశశాంక.

107

సంపూర్ణము.