పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా
రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా! 79

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొనర న్నొప్పెడువారు నీపదరుచి న్నూహించు నారాయణా! 80

మ. విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా
స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా! 81

మ. వెలయన్‌ యౌవనకాలమందు మరుఁడున్‌ వృద్ధాప్యకాలంబునన్‌
బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ
పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా! 82

మ. బలుకర్మాయత పాశబంధవితతిన్‌ బాహాపరిశ్రేణికిన్‌
జలయంత్రాన్విత బంధయాతనగతిన్‌ సంసార