పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్‌ భక్తి న్ననుష్ఠింపుచున్‌
నమర న్నన్న సువర్ణ గో సలిల కన్యా ధారుణి గ్రామ దా
నము లామ్నాయ విధోక్తి భూసురులకున్‌ సన్మార్గుఁ డై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁ డగు న్నామీఁద నారాయణా! 75

మ. ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా
కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీరూపులన్‌
అలర న్నంబు మితంబు లైసరసిలో నంభోరుహంబుల్‌ దగన్‌
నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా! 76

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్‌ మానాథ మీపాదముల్‌
గదియం జేర్చిన వాని కే నొడయడన్‌ గా దంచు నత్యున్నతిన్‌
పదిలుం డై సమవర్తి మృత్యువునకున్‌ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా! 77

మ. కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్‌ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబు సోఁకు నిను మున్‌ హేమాకృతిస్తోమమై
వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్‌ వేదాత్మ నారాయణా! 78

మ. నిరతానందయోగులై నియతులై నిర్భాగ్యులై