పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ దూలింపుచున్‌
జనితాహ్లాదముతోడ నీచరణముల్‌ సద్భక్తి పూజించి నిన్‌
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా! 66

మ. పరికింపన్‌ హరిభక్తి భేషజునకున్‌ భవ్యంబు గా మీఁద మీ
చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా! 67

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబునన్‌
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్‌ భక్తి న్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్‌ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్‌ భవ్యపదంబు నొందుటకు నై యవ్యక్త నారాయణా! 68

మ. సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్‌
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతిదర్పణమున న్నిస్సంగుఁ డై తన్ను దా
నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా! 69

మ. పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁ డై
నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముండు నై
పరమానందనిషేధముల్‌ సమ