పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవైన దయయుంచి నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపుడేలు సేవకుఁడను
వనజలోచన! నేనువట్టి మూర్ఖుఁడఁ జుమ్మి
నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి వోసినయట్లు
భక్తిమార్గంబను పాలు పోసి
తే. ప్రేమతో నన్నుఁ బోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగుణములోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 77

సీ. జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక
కమలారి యతికళంకమునుఁ బడసె
సొగసైన నీ నేత్రయుగముతో సరిరాక
నళినబృందము నీళ్లనడుమఁ జేరెఁ
గరిరాజవరద! నీగళముతో సరిరాక
పెద్దశంఖము బొబ్బపెట్టఁ దొడఁగె
శ్రీపతి! నీ దివ్యరూపుతో సరి రాక
పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁ డయ్యె
తే. నిందిరాదేవి నిన్ను మోహించి విడక
నీకుఁ బట్టమహిషి యయ్యె నిశ్చయముగ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 78

సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలు
సకలగ్రంథంబులు చదివినట్లు
భిక్ష మియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు