పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలికిన నీ కున్న పద వేమి బోవు? నీ
మోమైనఁ బొడచూపవేమి నాకు?
శరణుఁ జొచ్చినవాని సవరింపవలెఁ గాక
పరిహరించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపక యున్నఁ
బరు లెవ్వ రగుదురు పంకజాక్ష!
తే. దాత దైవంబు తల్లియుఁ దండ్రి వీవె
నమ్మియున్నాను నీ పాదనళినములను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 66

సీ. వేదముల్‌ చదివెడు విప్రవర్యుండైన
రణము సాధించెడు రాజులైన
వర్తక కృషికుఁడౌ వైశ్యముఖ్యుండైనఁ
బరిచరించెడు శూద్రవర్యుఁడైన
మెచ్చుఖడ్గముఁ బట్టిమెఱయు మ్లేచ్ఛుండైనఁ
బ్రజల కక్కఱపడు రజకుడైన
చర్మ మమ్మెడు హీన చండాలనరుఁడైన
నీ మహీతలమందు నెవ్వఁడైన
తే. నిన్నుఁ గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాఁడు మోక్షాధికారి యీ వసుధలోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 67

సీ. సకలవిద్యలు నేర్చి సభ జయింపఁగవచ్చుఁ
బూర్ణుఁడై రణమందుఁ బోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్య మేలఁగవచ్చు
హేమ గోదానంబు లియ్యవచ్చు