పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనచరాదులకు భోజన మెవ్వఁ డిప్పించెఁ
జెట్లకెవ్వఁడు నీళ్లు చేదిపోసె
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె
ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగఁ బాలు
మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించె
బసుల కెవ్వఁ డొసంగెఁ బచ్చిపూరి
తే. జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేఁడయ్య వెదకిచూడ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 44

సీ. దనుజారి! నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలరు కొదువ లేదు
బంట్లసందడివల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్యమహిమచేత
దండిగా భృత్యులు దగిలి నీకుండంగ
బక్క బంటే పాటి పనికి వచ్చు?
నీవు మెచ్చెడి పనుల్‌ నేను జేయఁగలేక
యింత వృథా జన్మమెత్తినాను
తే. భూజనులలోన నే నప్రయోజకుఁడను
గనుక నీ సత్కటాక్షంబు గలుగఁజేయు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 45

సీ. కమలలోచన! నన్నుఁ గన్నతండ్రివి గాన
నిన్ను నేమఱకుంటి నేను విడక
యుదరపోషణకునై యొకరి నే నాశింప
నేర నా కన్నంబు నీవు నడుపు