పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోటివైద్యులు గుంపుగూడివచ్చినఁ గాని
మరణ మయ్యెడు వ్యాధిమాన్పలేరు
తే. జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 37

సీ. జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాఁడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణగురురేఖ లిడినను
విష్ణు నొందక కాఁడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాఁడు శైవజనుఁడు
కాషాయ వస్త్రాలుగట్టి కప్పిన నేమి
యాశ పోవక కాఁడు యతివరుండు
తే. ఎట్టి లౌకికవేషాలు గట్టుకొనిన
గురునిఁ జెందక సన్ముక్తి దొరకఁబోదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 38

సీ. నరసింహ! నే నిన్ను నమ్మినందుకుఁ జాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె
నింకనైనఁ గటాక్షమియ్యవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠనగరమందే యుంచు
నరకమందే యుంచు నళిననాభ!