పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!
పన్నగాధిపశాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ!
నీలమేఘశరీర! నిగమవినుత!
తే. ఈ విధంబున నీనామమిష్టముగను
భజన సేయుచు నుందు నా భావమందు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 35

సీ. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని
కలుగఁజేసెడి భారకర్త వీవె
చదువు లెస్సఁగనేర్పి సభలో గరిష్ఠాధి
కార మొందించెడి ఘనుఁడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి
పేరు రప్పించెడి పెద్ద వీవె
బలువైన వైరాగ్యభక్తిజ్ఞానములిచ్చి
ముక్తిఁ బొందించెడు మూర్తి వీవె
తే. అవనిలో మానవుల కన్నియాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడివాఁడ వీవె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 36

సీ. కాయ మెంత భయానఁ గాపాడిననుగాని
ధాత్రిలో నది చూడ దక్కఁబోదు
ఏవేళ నేరోగమేమరించునొ? సత్త్వ
మొందఁగఁ జేయునే చందమునను
ఔషధంబులు మంచివనుభవించినఁ గాని
కర్మక్షీణంబైనఁ గాని విడదు