పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యన్యకాంతల మీఁద యాశ మానఁగలేను
నొరుల క్షేమము చూచియోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి
నేను జేసెడివన్ని నీచకృతులు
నావంటి పాపిష్ఠినరుని భూలోకాన
బుట్టఁ జేసితివేల భోగిశయన!
తే. అబ్జదళనేత్ర! నాతండ్రివైన ఫలము
నేరములు గాచి రక్షింపు నీవె దిక్కు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 33

సీ. ధీరతఁ బరుల నిందింప నేర్చితి గాని
తిన్నఁగా నినుఁ బ్రస్తుతింపనైతిఁ
బొరుగు కామినులందు బుద్ధి నిల్పితిఁ గాని
నిన్ను సంతతము ధ్యానింపనైతిఁ
బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని
యెంచి నీ కథ లాలకించనైతిఁ
గౌతుకంబునఁ బాతకము గడించితిఁ గాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
తే. నవనిలో నేను జన్మించినందుకేమి
సార్థకము గానరాదాయె స్వల్పమైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 34

సీ. అంత్యకాలమునందు నాయాసమున నిన్నుఁ
దలఁతునో తలఁపనో తలఁతు నిపుడె
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ!
దానవాంతక! కోటిభానుతేజ!