పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునిజనార్చిత! నిన్నుమ్రొక్కి వేఁడినఁగాని
కనులఁ బడవదేమి గడుసుఁదనము
చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని
భాగ్య మియ్యవదేమి ప్రౌఢతనము
స్థిరముగా నీ పాదసేవఁ జేసెద నన్న
దొరకఁ జాలవదేమి ధూర్తతనము
తే. మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి కడుపునిండు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 22

సీ. నీమీఁది కీర్తనల్‌ నిత్యగానముఁ జేసి
రమ్యమొందింప నారదుఁడఁగాను
సావధానముగ నీచరణ పంకజ సేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను
బాల్యమప్పటి నుండి భక్తి నీయందునఁ
గలుగను బ్రహ్లాదఘనుఁడఁగాను
ఘనముగా నీమీఁద గ్రంథముల్‌ గల్పించి
వినుతిసేయను వ్యాసమునినిగాను
తే. సాధుఁడను మూర్ఖమతి మనుష్యాధముఁడను
హీనుఁడను జుమ్మి నీవు నన్నేలుకొనుము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 23

సీ. అతిశయంబుగఁ గల్లలాడనేర్చితిఁగాని
పాటిగా సత్యముల్‌ పలుకనేర
సత్కార్య విఘ్నముల్‌ సలుప నేర్చితిఁగాని
యిష్ట మొందఁగ నిర్వహింపనేర