పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి
తే. తుదకు దొంగల కిత్తురో దొరల కవునో
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 15

సీ. లోకమం దెవఁడైన లోభి మానవుఁ డున్న
భిక్ష మర్థికిఁ జేతఁ బెట్టలేఁడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని
యొరులు పెట్టఁగఁ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱఁ జేరి తన ముల్లె చెడినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు
మేలు కల్గినఁ జాల మిడుకుచుండు
తే. శ్రీరమానాథ! యిటువంటిక్రూరునకును
భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 16

సీ. తనువులోఁ బ్రాణముల్‌ తర్లిపొయ్యెడి వేళ
నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరును గాని
యమునిచేతికిఁ జిక్కి శ్రమలఁ బడఁడు
పరమసంతోషాన భజనఁ జేసెడివారి
పుణ్య మేమనవచ్చు భోగిశయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర