పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాచకమ్మకు నేల మౌక్తికహారముల్‌?
క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
ఱంకుఁబోతుకు నేల బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్టవర్తనునకు?
తే. మాట నిలుకడ సుంకరిమోటు కేల?
చెవిటివానికి సత్కథాశ్రవణ మేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 13

సీ. మాన్యంబులీయ సమర్థుఁ డొక్కఁడు లేఁడు
మాన్యముల్‌ చెఱుప సమర్థులంత
యెండిన యూళ్ల గోఁడెఱిఁగింపఁ డెవ్వఁడుఁ
బండిన యూళ్లకుఁ బ్రభువులంత
యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁ డెవ్వఁడు
కలవారి సిరు లెన్నఁగలరు చాలఁ
దనయాలి చేష్టల తప్పెన్నఁ డెవ్వఁడు
బెఱకాంత ఱంకెన్నఁ బెద్దలంత
తే. యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 14

సీ. తల్లిగర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు
వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని
కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు