పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శార్దూలమునకేల శర్కరాపూపంబు?
సూకరంబునకేల చూతఫలము?
మార్జాలమునకేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబకునేల కుండలములు?
మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్‌?
బకసంతతికినేల పంజరంబు?
తే. ద్రోహచింతనఁ జేసెడు దుర్జనులకు
మధురమైన నీ నామమంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 11

సీ. పసరంబు పంజైనఁ బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాథుని తప్పు
తనయుఁడు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు
కూఁతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
దంతి దుష్టైన మామంతు తప్పు
తే. ఇట్టి తప్పు లెరుంగక యిచ్చవచ్చి
నటుల మెలఁగుదు రిప్పుడీ యవని జనులు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 12

సీ. కోతికి జలతారుకుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జాత్యంధునకును?