పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెదురుగాఁ బైకొన్న గోపాంగనా
రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్‌
పసిఁ గొంచున్‌ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా! 45

శా. చన్నుల్‌ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం
పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా
విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ
వన్నెల్‌ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా! 46

మ. పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వంబు నీవు న్మనో
హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ
వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా! 47

శా. కేలన్‌ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్‌ గట్టి క
ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్‌ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా! 48

శా. కాళిందీతటభూమి నాలకదుపుల్‌ కాలూఁది మేయన్‌ సము
త్తాలాలోల తమాలపాదప శిఖాం