పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలర ని న్నాలింగితుం జేయుచో
డెందంబుల్‌ దనివార రాగరసవీటీలీలలన్‌ దేల్చు మీ
మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా! 41

శా. విందు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొ మ్మయ్యయో
నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁబో వేమి మా
మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మి మ్మెత్తుకో
చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా! 42

శా. అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో
వెన్నల్‌ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై
యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడి నిన్నోలి న్నుతుల్‌ సేయుచున్‌
గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిఱుత వై కన్పింతు, నారాయణా! 43

శా. ఉల్లోలంబులుగాఁ గురుల్‌ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ
మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే
పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ
పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా! 44

మ. కసవొప్పన్‌ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య
ప్పసియు న్నీవును వచ్చుచో