పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగు మంత్రరాజ మమరున్‌ భూతాత్మ, నారాయణా! 37

మ. వరుసన్‌ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ
బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండు మీ
తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా! 38

మ. హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్‌ ధ్రువుం
గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్‌ ఘంటాశ్రవు న్నారదున్‌
గర మొప్ప న్విదురున్‌ బరాశరసుతున్‌ గాంగేయునిన్‌ ద్రౌపదిన్‌
నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా! 39

శా. శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా
భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులున్‌,
లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియున్‌ గల్గు నా
లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా! 40

శా. విందుల్‌ విందు లటంచు గోపరమణుల్‌ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
డందెల్‌ మ్రోయఁగ ముద్దుమో