పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో
నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్‌
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా! 33

మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై
సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యంతర
స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై
సరి లే కెప్పుడు నీదునామ మమరున్‌ సత్యంబు, నారాయణా! 34

మ. అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్‌
సుధయై వేదవినూత్నరత్నములకున్‌ సూత్రాభిధానంబునై
బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్‌
విధులై మీబహునామరాజి వెలయున్‌ వేదాత్మ, నారాయణా! 35

మ. పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్‌
ఘనపాపంబుల వైరి షడ్రిపులకున్‌ గాలావసానంబు మీ
వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా! 36

మ. భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబిం