పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

పేటలో లభించెను. పరిశోధకసంఘమువారి కీయవలసిన యీశతకమాతృకను దగ్గరనుంచికొని శుద్ధప్రతి వ్రాసి యెటులేని ముద్రించి వ్యాప్తిలోనికి దేవలయునని సంకల్పించుకొంటిని. ఇంతలో బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారు శతకములు సంపుటములుగా వేయ నెంచి మమ్మాపనిజూడ నియోగించుటచే మాచెంతను అందుబాటులోను గల యముద్రితశతకములతోఁబా టీశతకమును గూడ ముద్రించి ప్రకటింప నవకాశము లభించినది. నిజాంరాష్ట్రశతకకవులజీవితమునం దీశతకకర్తచరిత్రము చేరఁదగియున్నది.

కవి దాదాపు నూఱుసంవత్సరములకు నావలివాఁడు కాఁడని మేము విచారింపఁ దత్రత్యులు చెప్పిరి. ప్రమాణములగు నాధారములు లభింపకున్నను నీ కాలము విశ్వసనీయమే. నృకేసరిశతకము భక్తిరసోద్బోధకమై సులభశైలిలో సరసముగా నున్నది. అందందుఁ గొలఁదిగ వ్యాకరణలోపములు గలవు. శుద్దప్రతి వ్రాయుతఱి కొన్నిచోటులఁ గవిభావానుసారముగా లేఖకులలోపముల సవరించితిమి.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

1-6-26

శేషాద్రిరమణకవులు

శతావధానులు