పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కొని వారిప్రతి వారి కొసంగి కృతజ్ఞులము కానున్నారము. ఈయవకాశమును బోనీకుండుటకు రాష్ట్రీయసోదరాంధ్రులు ప్రార్థితులు.

ఈశతకమకుటమునందలి యాదగిరి నృసింహక్షేత్రము. ఇది నిజామురాష్ట్రమునందు సుప్రసిద్ధదుర్గమగు భువనగిరికి ఆరుకోసుల దూరమునను వంగపల్లి స్టేషనుకు మూఁడునాలుగుమైళ్ల దూరమునను గల గుట్టపై నున్నది. మార్గశిర శుద్దమునం దిచట గొప్పయుత్సవములు జరుగుచున్నవి. యాదగిరినే కృష్ణామండలమునందలి వేదగిరిగాఁ గొందఱు భావించిరిగాని యది ప్రమాదము, యాదగిరి నరసింహునిగూర్చి వాయఁబడినశతకములు యక్షగానములు గేయములు పెక్కులు గలవు. నిజామురాష్ట్రీయసోదరులతోడ్పాటుతో నవి యన్నియు నార్జించిన వాఙ్మయమున కెంతయో సేవగావించినటు లగును. ఈ యముద్రితశతకమును ముద్రణమున కొసంగిన రఘునాథరావుగారియెడలఁ గృతజ్ఞులము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు