పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పీఠిక

.

ఈశతకము రచించినది తిరువాయిపాటి వెంకటకవి. పరాంకుశునికుమారుఁడు. ఇతఁడు రచించిన శతకము యాదగిరినృసింహ యనుమకుటము గల కందశతక మింకను ముద్రితము కాలేదు. కవికులస్థలము లీశతకమునందు లేకున్నను బ్రవాదములనుబట్టి యెఱుంగవచ్చును. కవి నిజామురాష్ట్రములోని నల్లగొండమండలమునకు జెందిన కొలనుపాకలోఁ గొంతకాలము నివసించెననియు సాతానివైప్ణవుఁడనియు ఎనుబదిసంవత్సరములక్రిందట నుండియుండెననియుఁ గొందఱు చెప్పిరి. ఇత రాధారములు లభించువఱకీ ప్రవాదమును విశ్వసింపక తప్పదు.

మేము శతకసంపుటములోనికి అముద్రితశతకములను సేకరించుట విన్నంతమాత్రమున తమ చెంతగల యీశతకమాతృకను మఱియొక (యాదగిరినృసింహ)శతకమును మాకొసంగి మ-రా- శ్రీ గంగరాజు రఘునాథరావుగారు తోడ్పడుటచే శుద్ధప్రతివ్రాసి ప్రథమముద్రణము గావింప నవకాశము చిక్కినది. రఘునాథరావుగారివలె నాంధ్రభాషాభిమాను లెవరేని నిజామురాష్ట్రకవుల యముద్రితశతకము లొసంగిరేని ప్రత్యంతరము వ్రాసి