పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాథోనిధిం ద్రచ్చఁగాఁ
దమకించెన్‌ భువనత్రయంబును గిరుల్‌ దంతావళుల్‌ మ్రొగ్గినం
గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా! 12

శా. భీమాకారవరాహమై భువనముల్‌ భీతిల్లి కంపింప ను
ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్‌
హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మిన్‌ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా! 13

శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్‌
దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరున్‌
శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్‌ శోభిల్ల మన్నించి య
జ్జంభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు, నారాయణా! 14

మ. మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా
గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో
విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్‌
సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా! 15

మ. ధరణిన్‌ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
పరగం బైతృక తర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్‌
నిరువయ్యొక్కటిమారు