పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

భక్తిరసశతకసంపుటము


ఉ.

మంగళ మిందిరాహృదయ మంజులకంజమరందపానసా
రంగ ఘనాఘనోజ్జ్వలవిలాసశుభావహపూర్ణిమాంగ యు
త్తుంగదయాంతరంగ సురతోషితపాదసరోజగంగ స
న్మంగళహారతు ల్గొని సమంచితసత్కృపఁ బ్రోవు వేగ శ్రీ
రంగపురీశ భక్తజనరక్షక శ్రీరమణీమనోహరా.

301