పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక


ఈనారాయణశతకము వ్రాసినకవిపేరు శతక పద్యములందుఁ గానరాదు. వ్రాఁతప్రతులలో నొక దానిలోమాత్రము బమ్మెరపోతన రచించినటుల గద్యము గలదు. ఈగద్యము గ్రంథకర్త వ్రాసినదె యని విశ్వసింప వీలులేదు. ప్రత్యంతరములందుఁ గవిపేరే కానరాదు. పద్యములపోలికను బట్టియు భాగవతపద్యములను బోలినపద్యము లుంటవలనను బోతనరచితమె యని శతకకవులచరిత్రమునందుఁ జర్చింపఁబడినదిగాని ప్రమాణసమన్వితముగాని యాచర్చవలనఁ బ్రకృతమున కుపయోగము కానరాదు. భాగవతమున కీవలిశతకములందుఁ జాలవఱకు మత్తేభశార్దూలములందుఁ బోతన ననుకరించుట తఱచుగాఁ గాననగును. శైలినిబట్టిచూచినను గుణదోషములనుబట్టిచూచినను భాగవతమునకు భోగినీదండకమునకుఁ బోలికగాఁ గనిపింపదు. పోతనయే రచించెననువాదము నంగీకరించినచో నీ