బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
75
కలిగించునది, మన బ్రిటిషువారి స్నేహము. మనరాజ్యాక్రమణ మొదటిరోజున నెంత అధ్వాన్నముగ నుండెనో ఇరువదియేండ్లు జరిగిన పిదపగూడ నంత అధ్వాన్నముగనే యున్నది. (నేటికి నిట్లేయున్నది.) ప్రపంచ జ్ఞానముకలిగి వయసు మీరిన ఆంగ్లేయు లెట్లుందురో భారతీయులు కంటితో చూచి యెరుగరు. కేవలము బాలురేయని చెప్పతగిన ప్రపంచానుభవ మా వంతయు లేని యువకులు ఎట్టి సాంఘిక బంధనములు సానుభూతియు లేకుండా నేటివులను పరిపాలింతురు. వీరింగ్లాండులో నున్న భారతీయుల కెంతదూరముగ నుందురో ఇక్కడ వీరి జీవితవిధానమును భారతీయుల కంత దూరమైయుండును. వీరు ప్రజలతో కలసిమెలసి యుండరు. వీలైనంత సొమ్మును సాధ్యమైనంత త్వరలో సంపాదించుకొని సీమకు పోవుటకు వలసిన మట్టుకు తప్ప దేశముతో వీరెట్టి సంబంధమునుకలిగియుండరు. ప్రజల కష్టసుఖములతో వీరికిపనిలేదు. ఆయౌవన గర్వముతో ధన కాంక్షతో ఒకరి తరువాత నొకరు సముద్రపుటలలవలె వచ్చి వెనుకకు పోవుదురు. ఆహారాన్వేషణకొరకు వచ్చి దొరికినది తన్నుకొనిపోవు క్షుద్రపక్షులుగా వీరు భారతీయులకంటికి తోచుచుండిరి. ఆంగ్లేయునికి చెందిన ప్రతిరూకయు భారతీయునికి నష్టద్రవ్యమే.”
II
బ్రిటిషుపరిపాలన : భారతీయులు
“మన ప్రభుత్వ విధానములో ముఖ్యమైన దోషము మనము 'నేటివుల' నతి నీచముగా జూచుచుండుట, నమ్మ