పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

భారత దేశమున


తరమువారి జీవితములోనే వారుచేసిన అక్రమముల పాప ఫలితముగా వారి యధికారము నాశనమైపోవుటయు జరిగెను. ప్రజలకు విమోచనము కలిగెను. కొంత హింసయు ప్రజాపీడయు జరిగినను అది దేశీయరాజుల హింసగను ప్రజాపీడనముగ నుండి అంతకన్న బలవంతు లీహింసను ప్రజాపీడను తొలగించుట కవకాశముండెను. చాలా అక్రమములుండినను, అధికారము నిరంకుశముగ నుండినను ప్రకృతి స్వభావ విరుద్ధములు మాత్రము జరుగలేదు. ఆక్రమింపబడిన రాజ్యముయొక్క మూలాధారములు, ఉపపత్తులు ఎండగొట్టబడలేదు. అందువలన దేశములోని వ్యాపారము, పరిశ్రమలు, వాణిజ్యము అభివృద్ధిజెందెను. నాటిఅత్యాశ, ధనకాంక్షయు జాతీయ సంపదను కాపాడి దాని నుపయోగించునట్లు జేసినవే గాని దానిని నాశనము చేయలేదు. ఆనాటి రైతులు, వారి పారిశ్రామికులు సొమ్ము బదులుకావలసినచో హెచ్చువడ్డీలు చెల్లించుకోవలసివచ్చినను దేశములో మూలధనముమాత్రము సమృద్ధిగా నుండి వారికి అందుబాటులోనే యుండెను. ద్రవ్య సంపాదన మార్గములు కష్టతరములుగ నుండినను మొత్తముమీద దేశప్రజలు క్షేమలాభములుకలిగి ఔన్నత్యము జెందుచుండిరి. ఈ పద్దతులన్నియు బ్రిటిషు ప్రభుత్వమున తారుమారైనవి. తార్తారు మహమ్మదీయ దండయాత్రలు హానికరమైన మాట వాస్తవమే గాని నేడు భారత దేశమున నాశనము జేయుచున్నది మన పరిపాలన రక్షణమే. నాడు వారికి నష్టము కలిగించినది, తార్తారుల విరోధము. నేడు నష్టము