పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

భారత దేశమున


నింగ్లాండు పోవుటను నిషేధించినాడు. గాని తరువాత హార్డిం రాజ ప్రతినిధియైనప్పుడు సంస్థానాధీశుల విదేశవ్యవహారములపైన అనవసరపుహద్దు లేర్పరచుట ఈ సంస్థానాధీశుల యాత్మగౌరవమునకు భంగము అనినాడు. భారతదేశ స్వదేశసంస్థానములయొక్క రాజకీయ ప్రతిపత్తినిగూర్చి విచారించుటకు 1927 లో బ్రిటిషు గవర్నమెంటువా రేర్పరచిన విచారణసంఘమువా రీ సంస్థానముల స్వాతంత్ర్యమును సూత్రీకరించిరి. భారతదేశశాసనసభలకు బాధ్యతవహించు కేంద్రప్రభుత్వము స్థాపించునెడల నది నూతన రాజ్యాంగముపైన నాధారపడిన క్రొత్త ప్రభుత్వమగుననియు బ్రిటిష్‌ప్రభుత్వమువారికిని ఈ సంస్థానాధీశులకును చరిత్రరీత్యా ఏర్పడిన పరస్పర సంబంధములు వారి యంగీకారము లేకుండా ఈ క్రొత్తప్రభుత్వమునకు ట్రాన్సుఫరు చేయబడరాదనియు సలహా నిచ్చిరి. సంస్థాన ప్రజల పక్షమున కొందరు ప్రతినిధు లీ విచారణసంఘమును దర్శించి తమ సాధక బాధకములు చెప్పుకొన దలపగా సంస్థానములందలి ఆంతరంగిక పరిపాలనతో బ్రిటిషుప్రభుత్వమునకు సంబంధములేదని సాకుచెప్పి వారిమాటలు వినుటకు నిరాకరించిరి. అయితే పైన చెప్పబడినట్లు బ్రిటిషుప్రభుత్వమువారికి నీ సంస్థానములకును జరిగిన అన్ని సంధిపత్రములలోను ఆయా సంస్థానప్రజల సౌఖ్యమును పెంపొందించుటను. గూర్చిన షరతులు చేర్చబడియే యున్నవి. మరియు పైన జెప్పినట్లు బ్రిటిషుప్రభుత్వమువా రింతవరకు తమ సర్వాధికారములను చలాయించుచునే యున్నారుగాని ఇప్పుడీ రాజ్యాంగ