బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
69
1844 లో గ్వాలియరుతో సంధిచేయుటలోను 1881 లో మైసూరును పూర్వరాజుకు వశముచేయుటలోను వారుంచుకో తగిన సైన్యముల సంఖ్య తగ్గింపు చేయబడెను. శాంతిభద్రతలు కాపాడు బాధ్యత బ్రిటీషువారిదే గనుక సంస్థానములు
అవసరము వచ్చినప్పుడు వారి ఉత్తర్వులెల్ల శిరసావహించవలెను. సంస్థానములుంచు కొనదగిన ఆయుధములు నిర్ణయింపబడెను. లోపల కోటలు దుర్గములు బలముచేయరాదు. బ్రిటిషు సేనలకు అన్ని సదుపాయములు చేయవలెను.
V
ఇటీవల భారతదేశమున జాతీయోద్యమము ప్రబలుచున్న సందర్భమున కొంతకాలమునుండి బ్రిటిషువారి సంస్థానములతోడి సంబంధములందు ప్రయోగించు రాజనీతిలో మరల కొంతమార్పు కలిగెను. భారతదేశ జాతీయైక్యతను విచ్ఛిన్నముచేయుటకును, అఖిలభారత జాతీయ కేంద్రప్రభుత్వము నిర్మించుట కాటంకము కలిగించుటకును, ఈ సంస్థానములు స్వతంత్రప్రభుత్వములని ప్రకటింపసాగిరి. కర్జను రాజప్రతినిధిగా నుండగా నీ సంస్థానాధీశులు చేయు ప్రజాపీడనము దుర్వ్యయమునుజూచి యతడు వానిని మందలించి ఈ సంస్థానముల ఆదాయమును కేవలము స్వప్రయోజనముకొఱకుపయోగించుట కీ సంస్థానములు ఈ రాజుల స్వంతజమిందారీలు కావనియు కేవలము సోమరితనముతో కాలము వెళ్లబుచ్చుట కీ సంస్థానాధీశులకు భగవంతుడు శాశ్వతపట్టా వ్రాసి యివ్వలేదనియు హెచ్చరించినాడు. వీరు విచ్చలవిడిగా