పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

67


సంబంధములందుమాత్రము వారి యధికారములను తగ్గించుట, సంస్థానముల ప్రజలు తమ బాధలనుగూర్చి ఆందోళన చేసి తిరుగుబాటు చేయకుండా వారిని అణచియుంచుటకు బ్రిటిషు సైన్యములెల్లప్పుడును సంసిద్ధముగ నుంచబడునుగాని ఈసంస్థానాధీశుల క్రింద ప్రజ లెంత బాధపడుచున్నను వారి సివిలు హక్కులను సంరక్షించుటకైన నీ యూంగ్లేయ ప్రభువులు ప్రయత్నింపరైరి.

స్వదేశ సంస్థానముల యొక్క వంశపారంపర్యపు హక్కుదారు లెవరాయని నిర్ణయించుటలో కూడా బ్రిటిషు ప్రభుత్వమునకు హక్కుకలదని మణిపురము విషయమున 1891 లో నింగ్లాండులోని ఇండియా రాజ్యాంగ కార్యదర్శి - బహిరంగముగా ప్రకటించుటతో నీసంస్థానములపైన బ్రిటిషు ప్రభుత్వము చలాయించు సర్వాధికారములు స్పష్టీకరింప బడినవని చెప్పవచ్చును.

స్వదేశసంస్థానములలో సివిలు క్రిమినలు న్యాయవిచారణధికారములు చలాయించు సంస్థానాధీశుల రాజ్యములు, సార్వభౌమ ప్రభుత్వమువారికిని సామంత రాజ్యములకును సమష్టి గానట్టి యధికారములు గల రాజ్యములు, అని రెండు తరగతులుగా విభజించిరి. ఢిల్లీచక్రవర్తి సిపాయి విప్లవమున పాల్గొనెనను నేరమున కాతనిని విచారించి శాశ్వత కారాగార శిక్ష విధించుటతో భారతదేశ రాజులపైన మొగలాయి చక్రవర్తి సార్వభౌమత్వము పేరులేకుండ పోయినది. ఆంగ్లేయ రాజ్యమకుటమే భారతదేశ సార్వభౌమత్వమును వహించినది.