Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

భారత దేశమున


IV

సిపాయి విప్లవానంతరము ఈ సంస్థానముల తోడి బ్రిటిష్ సంబంధముల చరిత్రలో క్రొత్తఘట్టము ప్రారంభమైనది. ఆంగ్లేయసలహాదారులు, ఏజెంట్లు రెసిడెంట్లు సంస్థానములయొక్క ప్రభుత్వయంత్రమునందు హెచ్చుపలుకుబడిని సంపాదించి బలవంతులై ప్రవర్తించునట్లు చేయబడిరి. బహిరంగ మర్యాదలను కొన్నిటిని పైకి ప్రసాదించుచు, క్రమక్రమముగా ఆంగ్లేయప్రభుత్వముయొక్క సర్వాధికారములను బిగువుపరుపసాగిరి. ప్రతి సంస్థానములోను రెసిడెంట్లు నియమింపబడిరి. చాల సంస్థానములందు పేరున కాసంస్థానాధీశుడు రాజుగ నుండెను గాని నిజముగా పరిపాలించువాడు రెసిడెంటే! సైనికవ్యయముకొఱకు కప్పములు విధింపబడని సంస్థానములు సైన్యములనే పోషించవలసి యుండెను. బ్రిటిష్ వారి సైనిక వ్యూహములకొఱకు సంస్థానములందు రైళ్లను రోడ్లను బ్రిటిషువారు బలవంతముగా నిర్మించిరి. తపాలా తంతి చెలామణి బ్రిటిషువారు తమ చేతులలో నుంచుకొనిరి. ఆంగ్లప్రభుత్వ యిజారాలగు ఉప్పు, నల్లమందు సంస్థానములు తయారు చేయరాదు. గనులను త్రవ్వు హక్కులను ఆంగ్లేయకంపెనీల కిచ్చునట్లు ఒత్తిడిచేసిరి. తమ పలుకుబడి యధికారములను వినియోగించి బ్రిటిషువర్తకమును అభివృద్ధి పరచిరి. ఈబ్రిటిషురాజ్యతంత్రముయొక్క రాజ్యనీతిసూత్ర మేమనగా నీ సంస్థానాధీశులకు ప్రజలపైనగల నిమిత్తమాత్రములగు నిరంకుశాధికారములను హెచ్చించుట, బ్రిటిషువారితోడి