పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

61


(ఫ్రెంచి) వారినుండి ఈ దేశమును రక్షింప తోడ్పడెదరని నమ్ముచున్నాను.”

III

గవర్నరు జనరలు హేస్టింగ్సు (1818-31) ప్రైవేటు జర్నలువలన ఆనాడు స్వదేశ సంస్థానములపట్ల ప్రయోగింపబడిన రాజనీతి స్పష్టపడుచున్నది. “ఇప్పుడు వాతావరణమెల్ల యుద్ధమేఘములతో నిండినది. దీనికి ముఖ్యకారణము స్వదేశరాజులతోడి సంబంధము లింతవరకు నిర్ధారణ కాకపోవుటయే! వారితో మనము చేసికొన్న సంధిపత్రములందు వారినిస్వతంత్రరాజులుగా మనము పరిగణించుచున్నాము. వారి యాస్థానములకు మనము మన ప్రతినిధులను (రెసిడెంట్లను) పంపుదుము. వీరు కేవలము రాయబారులుగామాత్రమే వ్యవహరింపక సర్వాధికారులుగా ప్రవర్తింతురు. ఆ రాజుల స్వంత వ్యవహారములందుగూడ వీరు జోక్యము కలిగించు కొందురు. వారి కెదురుతిరుగు దుర్మార్గ ప్రజలకు వీరు మద్దతుచేయుదురు. సర్వాధికారము పెత్తనమును బహిరంగముగా ప్రదర్శనము చేయును. తాను జరిగించు చర్యలకు ప్రభుత్వము మద్దతు చేయగలందులకు మనకు లాభింపగల సందర్భముల నేవో కొన్ని చూపించును. అంతట మన కౌన్సిలువారతని నాయొక్కవిషయముననేగాక అన్నివిషయములందును సమర్థించి మద్దతుచేయుదురు. ఇక ఈరాజుల వారసత్వము విషయమునగూడ అనవసరముగా మనము జోక్యము కలిగించుకొనుచున్నాము. వీనివలన ఆరాజులకు లోపల