పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

భారత దేశమున


వలసిన వనియే వారి తలంపు. రెండవ సంగతి. ఇస్లాముమతమునకు అధీశుడగు ఖాలీఫును వారు దౌర్జన్యము చేసినారు. మహమ్మద్ ప్రవక్తగారి జ్ఞాపకములు మిగిలియున్న దేశములో యుద్ధము ప్రారంభించి నష్టపెట్టుచున్నారు.

ప్రస్తుత మీ ఫ్రెంచివారి నెదిరించుటకొరకు బ్రిటిషువారికిని గ్రాండ్ సీనియర్ కును స్నేహ సంబంధమైన ఒడంబడిక సంధిషరతులు జరిగి యున్నవి. బ్రిటిషుజాతికి వ్యతిరేకముగా మీరు ఫ్రెంచివారితో స్నేహము చేయుచున్నసంగతి గ్రాండ్ సీనియర్ కు తెలిసినది. ఫ్రెంచివారి కుట్రలవలన మోసముల వలన ద్రోహమువలన సీనియరుకు కలిగిన అనుభవ ఫలితము నతడు మీకు తెలియపరుపదలచినాడు. బ్రిటిషుసైన్యబలముల నుండి ప్రస్తుతము తప్పించుకొని తిరుగు ఫ్రెంచివారి వలన మీకు సహాయము కలుగునను పొరబాటు తలంపు మానవలెనని ఆయన మిమ్ముల హెచ్చరించుచున్నాడు. మీ ప్రవక్తల గోరీలను అపవిత్రము చేయుట పూర్తిచేసి మతము ధ్వంసము చేయువరకు గూడ వారు మీకు సహాయము చేయవత్తురనుట కల్ల. నేను అనేకమారులు మీకు సూచించుచు వచ్చిన రాజీ పద్దతు లింతవరకు మీరు పెడచెవిని బెట్టి యుంటిరి. మీమత గురువుయొక్క హితబోధలనైన మీరు విశ్వసించి ఇప్పుడు మారాయబారికి మీరు దర్శనమిచ్చి అతనితో మాటలాడి మామిత్రమండలికిని మీకును గల అభిప్రాయభేదముల నన్నిటిని ఫైసలు చేయించి ప్రపంచశాంతికి భంగము కలిగించు